Share News

మావిగన్‌తో జగన్‌ కొత్త కుట్రలు: ఎంపీ కలిశెట్టి

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:51 AM

ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పాల్జేసిన వైసీపీ... నేడు కూటమి ఆధ్వర్యంలో ప్రగతిపథంలో సాగుతున్న అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపించడం...

మావిగన్‌తో జగన్‌ కొత్త కుట్రలు: ఎంపీ కలిశెట్టి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌ను అధోగతి పాల్జేసిన వైసీపీ... నేడు కూటమి ఆధ్వర్యంలో ప్రగతిపథంలో సాగుతున్న అమరావతిలో అవినీతి జరుగుతోందని ఆరోపించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం, ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. మావిగన్‌ అనే పేరుని తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి, అయోమయంలో పడేసేందుకు జగన్‌ కొత్త కుట్రలు పన్నుతున్నారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను రాష్ట్రపతి ముర్ము ప్రశంసించారు’ అని అప్పలనాయుడు తెలిపారు.

Updated Date - Apr 14 , 2026 | 05:51 AM