Share News

ఏపీకి ఐటీ దిగ్గజాలు బారులు: టీడీపీ ఎంపీ హరీశ్‌

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:30 AM

దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చాలన్న లక్ష్యసాధనలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోందని టీడీపీ ఎంపీ జీఎం హరీశ్‌ బాలయోగి అన్నారు.

ఏపీకి ఐటీ దిగ్గజాలు బారులు: టీడీపీ ఎంపీ హరీశ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చాలన్న లక్ష్యసాధనలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోందని టీడీపీ ఎంపీ జీఎం హరీశ్‌ బాలయోగి అన్నారు. వికసిత భారత్‌ అనేది కేవలం ఒక నినాదం కాదని, నిరంతర జాతీయ మిషన్‌ అని, ఈ లక్ష్యసాధనలో ఎన్డీయే ప్రభుత్వంతో టీడీపీ కలిసి అడుగులు వేస్తోందని అన్నారు. బుధవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని సభ దృష్టికి తీసుకెళ్లారు. 2025-26లో దేశవ్యాప్తంగా జాతీయ పెట్టుబడి ప్రతిపాదనల్లో సుమారు 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు రావడం గర్వకారణమన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 06:30 AM