Share News

లెజిస్లేటివ్‌ వర్క్‌షాప్‌నకు టీడీపీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 05:11 AM

ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహించిన పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ వర్క్‌షాప్‌నకు టీడీపీ ఎమ్మెల్యేలు..

లెజిస్లేటివ్‌ వర్క్‌షాప్‌నకు టీడీపీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): ఇండియా ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో నిర్వహించిన పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రీసెర్చ్‌ వర్క్‌షాప్‌నకు టీడీపీ ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, బండారు శ్రావణి, కూన రవికుమార్‌, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ జాతీయ స్థాయి వర్క్‌షా్‌పలో వ్యవసాయం, భూమి, నీటి వనరులు అంశాలపై నిర్వహించిన పలు కీలక సెషన్లలో వారు పాల్గొన్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.

Updated Date - Jul 11 , 2026 | 05:13 AM