Share News

గత టీటీడీ పాలక మండలిని విచారించాలి: యార్లగడ్డ

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:13 AM

లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యవహారంలో గత టీటీడీ పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులనూ విచారణ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

గత టీటీడీ పాలక మండలిని విచారించాలి: యార్లగడ్డ

ఇంటర్నెట్ డెస్క్: లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన వ్యవహారంలో గత టీటీడీ పాలక మండలి చైర్మన్‌తోపాటు సభ్యులనూ విచారణ చేయాలని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్‌ చేశారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తిరుమలలో 1717లో లడ్డూ ప్రసాదాన్ని ప్రారంభించగా, అప్పటి నుంచి ఇప్పటివరకు మొఘలులు, బ్రిటిషువారు సహా పాలకులెవరూ ఇలా వైసీపీలా దుస్సాహం చేయలేదని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా టీటీడీనే దేశవాళీ, ఒంగోలు జాతి ఆవులను సంరక్షిస్తూ.. వాటి పాలతో స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయాలని సూచించారు.

Updated Date - Feb 25 , 2026 | 04:14 AM