Share News

పవన్‌పై జగన్‌ దుష్ప్రచారం

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:41 AM

జాతి సమైక్యత కోసం కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మాజీ సీఎం జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు..

పవన్‌పై జగన్‌ దుష్ప్రచారం

  • ఏ జైలులో ఉండాలో అతడే నిర్ణయించుకోవాలి: ఎమ్మెల్యే గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): జాతి సమైక్యత కోసం కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మాజీ సీఎం జగన్‌ దుష్ప్రచారం చేస్తున్నాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విమర్శించారు. ‘జగన్‌ విధానం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ప్రభుత్వానికి తలకుమించిన భారం అవుతోంది. వైసీపీ బూతుల పంచాంగాన్ని కూటమి ప్రభుత్వం సహించదు. జగన్‌కి ప్రాణభీతి ఉంది. అందుకే బయట తిరగడం లేదు. కనీసం 500మంది ఉంటే కాని జగన్‌ బయటకు రాలేడు. కాపు రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయలేదో జగన్‌ చెప్పాలి. ఆయన భవిష్యత్తులో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో ఉంటాడా, లేక చంచల్‌గూడా జైలులోనా అన్నది అతడే నిర్ణయించుకోవాలి’ అని గోరంట్ల తెలిపారు. తొలుత ఎమ్మెల్యే 38 మంది లబ్ధిదారులకు రూ.27.70 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు.

Updated Date - Jun 25 , 2026 | 03:41 AM