రాష్ట్రాన్ని కాపాడటమే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:44 AM
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసన మండలిలో మంత్రులు, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి..
సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నాం
గవర్నర్ ప్రసంగంలో ఇదే ఉంది: మంత్రి నిమ్మల
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా శాసన మండలిలో మంత్రులు, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. మంత్రి రామానాయుడు ప్రభుత్వం తరుపున సమాధానం చెప్తుండగా, వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి, గవర్నర్‌తో ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెప్పించిందంటూ.. నినాదాలు చేశారు. మంత్రి నిమ్మల ప్రసంగాన్ని కొనసాగిస్తూ, వైసీపీ పాలనతో వెంటిలేటర్ ఎక్కిన రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు తేవడంతోపాటు పోలవరం, రాజధాని నిర్మాణం సహా, రాష్ట్రాన్ని గాడిలో పెట్టి, పేదలకు సంక్షేమం, అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని, ఇదే విషయం గవర్నర్ ప్రసంగంలో ఉందని చెప్పారు. వైసీపీ, టీడీపీ సభ్యుల అరుపులు, కేకలతో మండలి హాలు గోలగోలగా మారింది. వైసీపీకి మనస్సాక్షి ఉండాలని టీడీపీ సభ్యుడు కంచర్ల శ్రీకాంత్ అన్నారు. వైసీపీ నేతల తీరును ప్రభుత్వ చీఫ్ విప్ అనురాధ తప్పు పట్టారు. జనసేన సభ్యుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని తాకట్టు పెడితే.. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడానికి ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు.