Share News

శ్రీకాకుళంలో మహానాడు.. 3 ప్రాంతాల్లో పరిశీలన

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:43 AM

శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణకు టీడీపీ నేతలు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పార్టీ జోనల్‌ చైర్మన్‌ శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య...

శ్రీకాకుళంలో మహానాడు.. 3 ప్రాంతాల్లో పరిశీలన

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో మహానాడు నిర్వహణకు టీడీపీ నేతలు స్థలాన్ని అన్వేషిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర పార్టీ జోనల్‌ చైర్మన్‌ శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పాతపట్నం, శ్రీకాకుళం ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, గొండు శంకర్‌ తదితర ముఖ్య నేతలు ఆదివారం పైడిభీమవరం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నగర పరిసరాల్లో మూడు ప్రధాన స్థలాలను పరిశీలించారు. పైడిభీమవరం వద్దే నిర్వహణకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి లోకేశ్‌ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 03:43 AM