Share News

ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో మహానాడు

ABN , Publish Date - May 05 , 2026 | 04:53 AM

నెల్లూరులో మే 27నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న మహానాడుకు వేదిక ఖరారయ్యింది.

ఇఫ్కో కిసాన్‌ సెజ్‌లో మహానాడు

  • రేపు ఉదయం భూమి పూజ.. పనులను పర్యవేక్షించిన మంత్రి నారాయణ

నెల్లూరు, మే 4(ఆంధ్రజ్యోతి): నెల్లూరులో మే 27నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న మహానాడుకు వేదిక ఖరారయ్యింది. నగరానికి సమీపంలోని కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ ప్రాంగణంలో మహానాడు నిర్వహించాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. బుధవారం ఉదయం భూమి పూజకు ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు.

Updated Date - May 05 , 2026 | 04:54 AM