Share News

మహానాడును విజయవంతం చేసిన.. అందరికీ కృతజ్ఞతాభివందనాలు: లోకేశ్‌

ABN , Publish Date - May 30 , 2026 | 05:39 AM

మహానాడు 2026 విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్‌ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

మహానాడును విజయవంతం చేసిన.. అందరికీ కృతజ్ఞతాభివందనాలు: లోకేశ్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): మహానాడు 2026 విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్‌ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీకి చెందిన కోట్లాది మంది కుటుంబసభ్యుల ఆశీస్సులతో నేను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరిగిన తొలి మహానాడు ఘన విజయం టీం టీడీపీ కృషికి నిదర్శనం. స్త్రీశక్తి థీమ్‌కు అసలైన అర్ధం చెప్పేలా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన తీర్మానానికి అందరి ఆమోదం లభించడం, దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం ఈ మహానాడు సాధించిన మరో గొప్ప విజయం. మహానాడు విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహానాడు విజయవంతానికి కృషి చేసిన తెలుగు తమ్ముళ్లకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.


మహానాడు హాజరులో నెల్లూరు, పేట టాప్‌

కార్యకర్తలు, నాయకుల హాజరులో మహానాడు 2026 రికార్డు సృష్టించింది. రెండు రోజులపాటు జరిగిన మహానాడుకు 24.50 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో నెల్లూరు టాప్‌లో నిలవగా, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చిలకలూరిపేట మొదటి స్థానంలో నిలిచింది. నెల్లూరు పార్లమెంటు నియోజవర్గంలో 1,16,000 మంది హాజరై రికార్డు సృష్టించారు.

Updated Date - May 30 , 2026 | 05:40 AM