Share News

చంద్రబాబు వల్లే మా బతుకుల్లో వెలుగులు

ABN , Publish Date - May 28 , 2026 | 04:50 AM

సమాజంలో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో చీకట్లో మగ్గిపోతున్న ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం చంద్రబాబు...

చంద్రబాబు వల్లే మా బతుకుల్లో వెలుగులు

  • టీడీపీ మహానాడులో ట్రాన్స్‌జెండర్‌ వర్షిణి వ్యాఖ్యలు

అమరావతి, మే 27 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అవమానాలు, కష్టాలు, కన్నీళ్లతో చీకట్లో మగ్గిపోతున్న ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం చంద్రబాబు అని ట్రాన్స్‌జెండర్‌ వర్షిణి అన్నారు. బాగా చదువుకున్నా కూడా సమాజంలో ముందుకు వెళ్లలేకపోతున్నామని బాధపడుతున్న తరుణంలో... ట్రాన్స్‌జెండర్లను కూడా సమాజంలో భాగంగా భావించి ‘అదర్స్‌’ కేటగిరీగా గుర్తించి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తున్నారన్నారు. సొంత ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తూ ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక భరోసా కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమంలో వర్షిణి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలోనే తమ జీవితాలు మెరుగుపడ్డాయని చెప్పారు. స్టేట్‌ వెల్ఫేర్‌ ట్రాన్స్‌జెండర్‌ బోర్డును ఏర్పాటు చేసి.. అందులో ట్రాన్స్‌జెండర్‌కి అవకాశం కల్పించిన ఘనత సీఎం చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో గత ప్రభుత్వం మళ్లీ చీకట్లు నింపాలని చూసిందని, అయితే 2024లో రాష్ట్ర ప్రజలిచ్చిన గొప్ప తీర్పుతో తమ జీవితాల్లో మళ్లీ మార్పు మొదలైందని వివరించారు.

Updated Date - May 28 , 2026 | 04:50 AM