తలనీలాలు అమ్ముకున్న 420లు
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:24 AM
జగన్ పాలనలో టీటీడీలో జరిగిన అరాచకాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి....
పరకామణి చోరీలోనూ వారి పాత్రే: భూమిరెడ్డి
అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): జగన్ పాలనలో టీటీడీలో జరిగిన అరాచకాలు బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర తెలిపారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. టీటీడీలో తలనీలాలు అమ్ముకున్న 420 బ్యాచ్ జగన్ చుట్టూ ఉందని బీద రవిచంద్ర అన్నారు. ఈ బ్యాచే పరకామణి దొంగతనానికి పాల్పడిందన్నారు.
సంగం డెయిరీకి సంబంధం లేదు: ధూళిపాళ్ల
సంగం డెయిరీకి వైష్ణవి డెయిరీకి ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. శాసనమండలిలో కల్తీ నెయ్యిని సమర్థించిన బొత్స సత్యనారాయణ ఆసుపత్రి పాలయ్యారన్నారు. స్వతంత్ర అభ్యర్థిని వైసీపీ అభ్యర్థిగా చైర్మన్ మాట్లాడించి, మండలి పరిధి దాటారని విమర్శించారు.