Share News

జగన్‌ ఓ ఫ్యాక్షనిస్టు.. రాజారెడ్డి క్రిమినల్‌: యనమల

ABN , Publish Date - May 23 , 2026 | 06:11 AM

జగన్‌ నాయకుడుగా కాదు ఒక ఫ్యాక్షనిస్టుగా మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.

జగన్‌ ఓ ఫ్యాక్షనిస్టు.. రాజారెడ్డి క్రిమినల్‌: యనమల

తుని రూరల్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): జగన్‌ నాయకుడుగా కాదు ఒక ఫ్యాక్షనిస్టుగా మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తుని తేటగుంటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కడప జిల్లాలో ఫ్యాక్షన్‌కు ప్రాణం పోసి, పెంచి పోషించింది జగన్‌ కుటుంబమే. జగన్‌ తాత రాజారెడ్డిది క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌. ఆయన జీన్స్‌ నిండుగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి నీతివంతుడు ఎలాగవుతాడు? రాష్ట్రానికి భవిష్యత్‌ ఉండకూడదన్నదే జగన్‌ ఏకైక అజెండా. నేర చరిత్ర గల జగన్‌ రాజకీయాలకు అనర్హుడు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు?’ అని యనమల ప్రశ్నించారు.

Updated Date - May 23 , 2026 | 06:11 AM