Share News

నైతిక విలువల్లేని నేత జగన్‌: వర్ల

ABN , Publish Date - Jun 17 , 2026 | 04:42 AM

‘‘నైతిక విలువల్లేని నిఖార్సయిన అవినీతి నేత జగన్‌ రెడ్డి.’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.

నైతిక విలువల్లేని నేత జగన్‌: వర్ల

అమరావతి, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘‘నైతిక విలువల్లేని నిఖార్సయిన అవినీతి నేత జగన్‌ రెడ్డి.’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌ రాజకీయ ప్రస్థానం అంతా కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగింది. జగన్‌తో పనిచేసిన అధికారులు జైలు పాలైతే, చంద్రబాబు, లోకేశ్‌తో పనిచేసిన అధికారులు అందలాలు ఎక్కారు. అవార్డులు, రివార్డులు పొందారు. లోకేశ్‌ పీఏకి గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ ఇస్తే జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ వందలాది కోట్ల అవినీతికి పాల్పడి చట్టానికి చిక్కారు. చంద్రబాబు విజన్‌ వల్ల సత్యం రామలింగరాజు లాంటి ఐటీ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు. అదే రామలింగరాజు ఎప్పుడైతే జగన్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారో అప్పుడే జైలు పాలయ్యారు.’’ అని వర్ల పేర్కొన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 04:43 AM