ధనపిశాచి జగన్
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:10 AM
కన్న తలినీ, తోడబుట్టిన చెల్లినీ మోసం చేసిన ధనపిశాచి జగన్ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తల్లిని, చెల్లిని మోసం చేశాడు: రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కన్న తలినీ, తోడబుట్టిన చెల్లినీ మోసం చేసిన ధనపిశాచి జగన్ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.వేల కోట్లు దోచుకున్న జగన్‌కి ధనదాహం తీరక అధికారంలో ఉన్న ఐదేళ్లలో డబ్బుల కోసం రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశాడు. ఇంట్లో వాళ్లు, ప్రజలు ఛీకొట్టిన తర్వాత కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని మాయమాటలు చెబుతున్నాడు. జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాది, టెర్రరిస్టు కన్నా ప్రమాదకరం’ అని మండిపడ్డారు.