Share News

పొదుపుపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదం: శ్రీనివాస్‌ రెడ్డి

ABN , Publish Date - May 16 , 2026 | 05:30 AM

ఐదేళ్ల పాలనలో ప్ర జల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌ పొదుపు గురించి సుద్దులు చెప్ప డం హాస్యాస్పదమని టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ రెడ్డప్పగారి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.

పొదుపుపై జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదం: శ్రీనివాస్‌ రెడ్డి

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల పాలనలో ప్ర జల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్‌ పొదుపు గురించి సుద్దులు చెప్ప డం హాస్యాస్పదమని టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్‌ రెడ్డప్పగారి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ‘అధికారం పోయాక ప్యాలె్‌సలో కూ ర్చుని ఇప్పుడు పొదుపు లెక్కలు చెబుతున్న జగన్‌కి గతంలో తానేం చేశారో గుర్తు లేదా? పేదలకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన లేదు కానీ, టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లకు తన పార్టీ రంగులు వేయించుకోవడానికి రూ.వంద ల కోట్లు ఖర్చు చేశారు. కోర్టు జోక్యంతో మళ్లీ ఆ రంగుల ను తొలగించడానికి రూ.3000 కోట్లు వృధా చేశారు. సర్వే రాళ్ల మీద జగన్‌ బొమ్మలకి ఏకంగా రూ.700 కోట్లు ఖర్చు పెట్టారు. రైతుల పాస్‌ పుస్తకాల మీద జగన్‌ ఫొటోలు కోసం రూ.13 కోట్లు తగలేశారు. మొత్తంగా రూ.7000 కోట్ల ప్రజల సొమ్మును తన సోకుల కోసం, ప్రచార పిచ్చి కోసం జగన్‌ దుబారా చేశారు. సంక్షోభాన్ని ముందుగా గుర్తించిన చంద్రబాబు ఖజానాపై భారం తగ్గించేందుకు పొదుపు చర్యలు చేపడితే దానిపైనా జగన్‌ పత్రిక విషం చిమ్ముతోంది’ అని శ్రీనివాస్‌ రెడ్డి మండిపడ్డారు.

Updated Date - May 16 , 2026 | 05:31 AM