Share News

మీడియా, పోలీసుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

ABN , Publish Date - May 11 , 2026 | 04:51 AM

మీడియా, పోలీసుల గురించి మాట్లాడే అర్హత జగన్‌ కు లేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంక న్న మండిపడ్డారు.

మీడియా, పోలీసుల గురించి  మాట్లాడే అర్హత జగన్‌కు లేదు

  • రూల్‌ ఆఫ్‌ లా మరచి ఐదేళ్ల పాలన

  • అందుకే 11 సీట్లకు పరిమితం: బుద్దా వెంకన్న

విజయవాడ అర్బన్‌, మే 10(ఆంధ్రజ్యోతి): మీడియా, పోలీసుల గురించి మాట్లాడే అర్హత జగన్‌ కు లేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంక న్న మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో మా ట్లాడుతూ సోషల్‌ మీడియాలో జగన్‌ పెడుతున్న పోస్టులపై విమర్శలు గుప్పించారు. టీడీపీ సోషల్‌ మీడియా ఎప్పుడూ జగన్‌కు సంబంధించిన మహిళ ల గురించి మాట్లాడలేదని తెలిపా రు. వైసీపీ సోషల్‌ మీడియాపై షర్మిల, సునీత స్వయంగా ఫిర్యా దు చేశారన్నారు. జగన్‌తో విభేదించినందుకు షర్మిలను దూషించార ని మండిపడ్డారు. రూల్‌ ఆఫ్‌ లా మరచి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించారని, ప్రజల ఆర్తనాదాలను పట్టించుకోకుండా తాడేపల్లిలో జగన్‌ ఫిడేలువాయించుకున్నారని విమర్శించారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను భరించలేకే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని చెప్పారు. జగన్‌ హ యాంలో అరాచకాలు చేసిన పోలీసులు సస్పెండ్‌ అయితే, చంద్రబాబు హయాం లో పనిచేసిన పోలీసులు పదోన్నతులు పొంది మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ హయాంలో సుమారు 2,800 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నారని తెలిపారు.

Updated Date - May 11 , 2026 | 04:51 AM