Share News

ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్‌: అశోక్‌బాబు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:53 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు కె.వెంకట్రామిరెడ్డిని జగన్‌ ప్రభుత్వంలోనే సస్పెండ్‌ చేశారు. దీన్ని జగన్‌ మర్చిపోయి, ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు....

ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్‌: అశోక్‌బాబు

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినందుకు కె.వెంకట్రామిరెడ్డిని జగన్‌ ప్రభుత్వంలోనే సస్పెండ్‌ చేశారు. దీన్ని జగన్‌ మర్చిపోయి, ఇప్పుడు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్‌. ఉద్యోగులకు రూ.30వేల కోట్లు బాకీపెట్టిన ఆయన... ఏనాడూ వారికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీ ఇచ్చి చరిత్రలో నిలిచిపోయిన ఒకే ఒక్క సీఎం జగన్‌. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్‌ పెట్టిన బాకీల్లో రూ.22వేల కోట్లును ఉద్యోగులకు చెల్లించింది. ఒక సెక్షన్‌ అధికారిని సస్పెండ్‌ చేస్తే.. ‘చంద్రబాబూ తప్పు చేస్తున్నావ్‌’ అని జగన్‌ హెచ్చరించడం విడ్డూరం. తప్పుడు మాటలు మాట్లాడుతున్న జగన్‌ని జైల్లో పెట్టకుండా చంద్రబాబు నిజంగానే తప్పు చేశారని అశోక్‌బాబు అన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 03:53 AM