Share News

‘స్థానికం’లో సమన్వయం!

ABN , Publish Date - Jul 14 , 2026 | 03:57 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగా బుధవారం (15న) కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

‘స్థానికం’లో సమన్వయం!

  • రేపు కూటమి పార్టీల సమావేశం

  • సమన్వయ కమిటీల నియామకం

  • నియోజకవర్గాల్లో విభేదాలపై చర్చ

అమరావతి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు సమాయత్తమవుతున్నాయి. అందులో భాగంగా బుధవారం (15న) కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ భేటీ ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు కూటమి పార్టీల నడుమ ఎలాంటి విభేదాలూ తలెత్తకుండా చూడడానికి ఏమేం చర్యలు తీసుకోవాలి.. జిల్లా మొదలు గ్రామ స్థాయి వరకు సమన్వయ కమిటీల ఏర్పాటు, వాటి విధివిధానాలపై చర్చించనున్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్సీ హరిప్రసాద్‌.. బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌ పాల్గొంటారు.

Updated Date - Jul 14 , 2026 | 03:59 AM