Share News

సౌదీలో అమరావతి విజయోత్సవ సభ

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:26 AM

ఆంధ్రాలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు ప్రజానీకం జయహో అమరావతి అంటూ నినదించింది.

సౌదీలో అమరావతి విజయోత్సవ సభ

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

ఆంధ్రాలోనే కాదు విదేశాల్లో కూడా తెలుగు ప్రజానీకం జయహో అమరావతి అంటూ నినదించింది. సౌదీ అరేబియాలో టీడీపీ అధ్వర్యంలో రాజధాని రియాధ్‌ నగరంలో శుక్రవారం రాత్రి విజయోత్సవ సభను ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. నాయకులు జానీ బాషా, రాజశేఖర్‌ చెన్నుపాటి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. భవానీ శంకర్‌, సుచరిత దంపతులు తమ కుటుంబం అమరావతి నిర్మాణానికి 2014లో ఇచ్చిన భూమి గురించి వెల్లడించారు. గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.

Updated Date - Apr 04 , 2026 | 04:28 AM