Share News

టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:41 AM

బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే రాజ్యాధికారం సాధ్యమని, సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఇది మరోసారి నిరూపితమైందని..

టీడీపీతోనే బీసీలకు రాజ్యాధికారం

అనంతపురం క్రైం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే రాజ్యాధికారం సాధ్యమని, సీఎం చంద్రబాబు నిర్ణయంతో ఇది మరోసారి నిరూపితమైందని టీడీపీ అనంతపురం నాయకులు అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు సుఽధాకర్‌ యాదవ్‌ నేతృత్వంలో చంద్రబాబు చిత్రపటానికి బుధవారం క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఫిరోజ్‌, తేజశ్విని, రంగాచారి, మూర్తి పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 03:42 AM