మహానాడు కమిటీల నియామకం
ABN , Publish Date - May 08 , 2026 | 05:28 AM
నెల్లూరులో ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న 44వ మహానాడు నిర్వహణకు మొత్తం 21 కమిటీలను నియమించారు. మహానాడు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా..
21 కమిటీలను నియమించిన టీడీపీ అధిష్ఠానం
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): నెల్లూరులో ఈ నెల 26, 27, 28 తేదీల్లో నిర్వహించనున్న 44వ మహానాడు నిర్వహణకు మొత్తం 21 కమిటీలను నియమించారు. మహానాడు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ నియమితులయ్యారు. కో- కన్వీనర్‌గా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును నియమించారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు(ఏపీ), బక్కని నరసింహులు(తెలంగాణ), మాణిక్యం యాదవ్(అండమాన్)ను నియమించారు. తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడు, వసతి ఏర్పాట్ల కమిటీ కన్వీనర్‌గా కింజరాపు అచ్చెన్నాయుడు, సభా నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా పయ్యావుల కేశవ్, భోజనాల ఏర్పాట్ల కమిటీ కన్వీనర్‌గా బీసీ జనార్దన్ రెడ్డి, మీడియా కమిటీ కన్వీనర్‌గా వంగలపూడి అనిత, సభ్యులుగా పార్టీ రాష్ట్ర సమన్వయకర్తలు బీవీ రాముడు, దారపనేని నరేంద్ర, ఆర్థిక వనరుల కమిటీ కన్వీనర్‌గా అనగాని సత్యప్రసాద్, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ కన్వీనర్‌గా గుమ్మిడి సంధ్యారాణి, ఫొటో ప్రదర్శన కమిటీ కన్వీనర్‌గా టీడీ జనార్దన్, ప్రతినిధుల నమోదు కమిటీ కన్వీనర్‌గా చింతకాయల విజయ్, సభాప్రాంగణ పర్యవేక్షణ కమిటీ కన్వీనర్‌గా నిమ్మల రామానాయుడు, అలంకరణ కమిటీ కన్వీనర్‌గా పులివర్తి వెంకట మణి ప్రసాద్(నాని), రవాణా కమిటీ కన్వీనర్‌గా పొంగూరు నారాయణ, వాహన పార్కింగ్ కమిటీ కన్వీనర్‌గా మంతెన రామరాజు, రక్తదానం, మెడికల్ క్యాంపు కమిటీ కన్వీనర్‌గా డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వలంటీరుల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కొల్లు రవీంద్ర, జనసమీకరణ కమిటీ కన్వీనర్‌గా గొట్టిపాటి రవికుమార్, పరిశుభ్రత, సుందరీకరణ కమిటీ కన్వీనర్‌గా వాసంశెట్టి సుభాశ్‌ను నియమించారు.