బీసీలంటే వైసీపీ నేతలకు చులకన: టీడీపీ
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:54 AM
బీసీలంటే వైసీపీ నేతలకు చులకనభావమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు విమర్శించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): బీసీలంటే వైసీపీ నేతలకు చులకనభావమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు విమర్శించారు. టీటీడీ ఈవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీసీ సామాజికవర్గానికి చెందిన ముద్దాడ రవిచంద్ర పట్ల వైసీపీ నేత భూమన చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యమిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం బీసీలను తీవ్రంగా అవమానిస్తున్నారు. అవినీతి కేసుల్లో అరెస్టయినభూమన ఒక ఐఏఎస్ అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. వెంటనే క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.