Share News

అమరావతి రాష్ట్ర సంపద

ABN , Publish Date - May 04 , 2026 | 04:55 AM

అమరావతి రాజధాని మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజల సంపద అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ..

అమరావతి రాష్ట్ర సంపద

  • అభివృద్ధిని ఓర్వలేకే వైసీపీ విమర్శలు

  • విజయసాయిరెడ్డికి మతి భ్రమించింది: బుద్దా వెంకన్న

విజయవాడ అర్బన్‌, మే 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధాని మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజల సంపద అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేసి, ప్రజాధనాన్ని దోచుకున్నారని, అందుకే ప్రజలు ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై నమ్మకంతో కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారని, ఇప్పుడు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అమరావతిలో అభివృద్ధి పరుగులు పెడుతోందని, అది చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి అన్ని పార్టీలు తలుపులు మూసేశాయని, దీంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఇలా ఇంకోసారి చంద్రబాబు గురించి మాట్లాడితే దేహశుద్ధి చేస్తామని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి, సర్పంచ్‌గా గెలిచినా తాను రాజకీయాలను వదిలేస్తానని సవాల్‌ విసిరారు. రాష్ట్రానికి గూగుల్‌ డేటా సెంటర్‌ను తెచ్చిన ఘనత చంద్రబాబు, లోకేశ్‌లదేనన్నారు. చంద్రబాబుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఖ్యాతిని చూసి కుళ్లుకుంటున్నారని, అందుకే సజ్జల, జోగి రమేశ్‌, విడదల రజని తదితరలతో వాగిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపైనా, అమరావతిపైనా విషం చిమ్మితే వైసీపీ నాయకుల సంగతి చూస్తానని హెచ్చరించారు.

Updated Date - May 04 , 2026 | 04:56 AM