Share News

టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్లకు జిల్లాల కేటాయింపు

ABN , Publish Date - May 13 , 2026 | 05:35 AM

టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్లకు జిల్లాలను కేటాయించారు. బెందాళం అశోక్‌కు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు, సుజయ్‌ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం జిల్లాలు, మంతెన వెంకట సత్యనారాయణ రాజుకు చిత్తూరు..

టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్లకు జిల్లాల కేటాయింపు

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్లకు జిల్లాలను కేటాయించారు. బెందాళం అశోక్‌కు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలు, సుజయ్‌ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం జిల్లాలు, మంతెన వెంకట సత్యనారాయణ రాజుకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి జిల్లాలు, అరిమిల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు జిల్లాలు, ప్రత్తిపాటి పుల్లారావుకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి జిల్లాలు, మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు జిల్లాలు, పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డికి కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలు, దామచర్ల సత్యకు అనంతపురం, హిందూపురం, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు, బీటీ నాయుడికి బాపట్ల, నరసరావుపేట జిల్లాలను కేటాయిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - May 13 , 2026 | 05:35 AM