18 నుంచి మినీ మహానాడులు
ABN , Publish Date - May 12 , 2026 | 04:47 AM
తెలుగుదేశం పార్టీ 44వ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మినీ మహానాడుల నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు.
20 వరకూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో...
23, 24న పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహణ
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ 44వ మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు మినీ మహానాడుల నిర్వహణకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 18, 19, 20న నియోజకవర్గ స్థాయి, 23, 24 తేదీల్లో పార్లమెంటు స్థాయి మినీ మహానాడులను నిర్వహించాలని ఆదేశించారు. ఈ మహానాడుల్లో చేసిన తీర్మానాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించాలని పల్లా ఆదేశించారు. అసెంబ్లీ నియోజకవర్గ మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను 21 నాటికి, పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను 24 నాటికి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.