ఈ సారి జంబో కమిటీయే..!
ABN , Publish Date - Apr 10 , 2026 | 03:33 AM
టీడీపీ రాష్ట్ర కమిటీని సుమారు 250 మందితో ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి కుదించాలని భావించినప్పటికీ.. పార్టీపరంగా న్యాయం ...
250 మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ
33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కమిటీని సుమారు 250 మందితో ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి కుదించాలని భావించినప్పటికీ.. పార్టీపరంగా న్యాయం చేయాల్సిన వారి జాబితా చాలా పెద్దదిగా ఉండడంతో జంబో కమిటీ తప్పదని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు... అధినేత చంద్రబాబు, లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. విప్లవాత్మక మార్పులతో ఈ కమిటీ కూర్పు చేపట్టనున్నారు. ఇందులో పలువురు ఎమ్మెల్యేల వారసులకు చోటు కల్పించనున్నారు. మండల స్థాయికి చెందిన ఇద్దరు చురుకైన నాయకులకు పొలిట్‌బ్యూరోలో నియమించాలని నిర్ణయించారు. అలాగే మహిళలకు రాష్ట్ర కమిటీలోనూ 33శాతం పదవులు ఇవ్వాలని నిశ్చయించారు. దీనికి అనుగుణంగా జాబితాలో మార్పులు చేసి త్వరలో కమిటీని ప్రకటించాలని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది.