Share News

రాజ్యసభలో కూటమి ఎంపీల ప్రమాణస్వీకారం

ABN , Publish Date - Jun 26 , 2026 | 06:27 AM

రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన కూటమి నేతలు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి రెండోసారి ఎన్నికైన సానా సతీశ్‌తో పాటు, చింతకాయల..

రాజ్యసభలో కూటమి ఎంపీల ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ, అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన కూటమి నేతలు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీడీపీ నుంచి రెండోసారి ఎన్నికైన సానా సతీశ్‌తో పాటు, చింతకాయల విజయ్‌, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేశ్‌ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం, రాజ్యసభలో చైర్మన్‌ సీపీ రాధాకృష్ణన్‌ వివిధ పార్టీలకు చెందిన 10 మంది ఎంపీలతో ప్రమాణం చేయించారు. వీరిలో సతీశ్‌, రామకృష్ణ, రమేశ్‌ తెలుగులో, చింతకాయల విజయ్‌ హిందీలో ప్రమాణం చేశారు. అనంతరం, రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌తో విజయ్‌, రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు... తన కుటుంబ సభ్యులతో కలసి లింగమనేని రమేశ్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు.

Updated Date - Jun 26 , 2026 | 06:32 AM