Share News

టీడీపీ హయాంలోనే హజ్‌కమిటీకి స్వేచ్ఛ: షరీఫ్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 05:36 AM

టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా హజ్‌ కమిటీకి పూర్తి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఇస్తుందని ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్‌ పేర్కొన్నారు.

టీడీపీ హయాంలోనే హజ్‌కమిటీకి స్వేచ్ఛ: షరీఫ్‌

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా హజ్‌ కమిటీకి పూర్తి స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను ఇస్తుందని ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్‌ పేర్కొన్నారు. హజ్‌ కమిటీ నియామకాలపై జగన్‌ పత్రిక, వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోడిగుడ్డు మీద ఈకలు పీకే చందంగా.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముస్లింలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 05:37 AM