గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై టాస్క్‌ఫోర్స్
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:06 AM
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.
వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. సీడీఎంఏ పి.సంపత్‌కుమార్ చైర్‌పర్సన్‌గాను, కన్వీనర్‌గా జాయింట్ డైరెక్టర్ ఎస్.రవీంద్రబాబు, సభ్యులుగా డీటీసీపీ అడిషనల్ డైరెక్టర్ జీవీజీఎస్ వరప్రసాద్, పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ స్వామినాయుడు, ఏపీయూఎ్‌ఫఐడీసీ డైరెక్టర్ టెక్నికల్ ఎ.సుధాకర్, మెప్మా అడిషనల్ మిషన్ డైరెక్టర్ కేఎన్ వెంకటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి.దశరథరామిరెడ్డి, ఏపీ టిడ్కో డిప్యూటీ డైరెక్టర్ హరిప్రసాద్, ఏపీయూఐఏఎంఎల్ సీటీఓ బుర్రా శ్రీనివాస్ లక్ష్మి నారాయణలను నియమిస్తూ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.