తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి శివైక్యం
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:39 AM
కాకినాడ జిల్లా తునిలోని తపోవన ఆశ్రమం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి జీ (52) శివైక్యం చెందా రు. శుక్రవారం తెల్లవారుజామున తపోవనం క్షేత్రంలో స్వామిజీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
తుని ఆశ్రమానికి తరలివచ్చిన ప్రముఖులు
తుని రూరల్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తునిలోని తపోవన ఆశ్రమం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి జీ (52) శివైక్యం చెందా రు. శుక్రవారం తెల్లవారుజామున తపోవనం క్షేత్రంలో స్వామిజీ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్వామిజీ నిత్యం గోసేవ, ధర్మ పరిరక్షణకు పరితపించేవారు. స్వామిజీ పార్ధివ దేహానికి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. శుక్రవారం సాయం త్రం తపోతన క్షేత్రంలో శాస్త్రోక్తంగా స్వామిజీ అంతిమ క్రతువులు ముగిశాయి.