Share News

తణుకు అభివృద్ధికి రూ.8.12 కోట్లు

ABN , Publish Date - Apr 02 , 2026 | 04:28 AM

తణుకు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రూ.8.12 కోట్లు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 32వ వార్డు పైడిపర్రు చెరువు వద్ద...

తణుకు అభివృద్ధికి రూ.8.12 కోట్లు

  • కాపవరం ఇళ్ల స్థలాల పరిష్కారానికి కృషి

  • పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు

  • ‘అక్షరం అండగా..’ సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ

తణుకు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): తణుకు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రూ.8.12 కోట్లు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు 32వ వార్డు పైడిపర్రు చెరువు వద్ద ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ఆధ్వర్యంలో ‘అక్ష రం అండగా.. పరిష్కారమే అజెండాగా’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వేమూరి ఆదిత్య ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక. ఈ సదస్సును తణుకులో ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటికే తణుకులో 233 పనులకు సంబంధించి రూ.22 కోట్లతో అభివృద్ధి చేశాం. తాజాగా 413 పనుల కు రూ.8.12 కోట్లు కేటాయిస్తున్నాం. 2025 మార్చిలో సీఎం తణుకు పర్యటనకు వచ్చినపుడు నిధులు కావాలని అడిగాం. రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పం పాం. కోటి 30 లక్షలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నాం. పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. కొత్త మాస్టర్‌ప్లాన్‌తో పట్టణ రూపు రేఖలు మారి మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి’ అని చెప్పారు.

70 అర్జీల స్వీకరణ

కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు 70 మంది వినతులు ఇచ్చారు. ‘ఆంధ్రజ్యోతి’ బ్రాంచి మేనేజర్‌ బి.హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌, తహసీల్దార్‌ అశోక్‌వర్మ పాల్గొన్నారు. మునిపల్‌ అధికారులు ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసుకున్నారు.

Updated Date - Apr 02 , 2026 | 04:28 AM