ముగిసిన ‘తాలీం’ టాలెంట్ టెస్ట్
ABN , Publish Date - May 18 , 2026 | 05:03 AM
రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఏ- హునర్ టాలెంట్ టెస్ట్ ముగిసింది. 27 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
హాజరైన 6,605 మంది విద్యార్థులు
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలీం-ఏ- హునర్ టాలెంట్ టెస్ట్ ముగిసింది. 27 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 7,392 మందిలో 6,605 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ల ఈడీలు, డీఆర్వోలు, 450 మంది సిబ్బంది సమన్వయంతో పరీక్ష నిర్వహించారు. వక్ఫ్ బోర్డు సీఈవో యాకూబ్ భాషా పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వక్ఫ్ బోర్డు అధికారులు తెలిపారు. అన్ని కేంద్రాల నుంచి ప్రశ్న పత్రాలను కట్టుదిట్టమైన భద్రతతో విజయవాడలోని కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక బృందాలు మూల్యాంకనం చేపట్టనున్నాయి.