జిల్లా విద్యార్థుల ప్రతిభ
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:55 PM
జాతీయస్థాయి స్క్వై మార్షల్ ఆర్ట్స్ చాంపియనషి్‌పలో నంద్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచినట్లు స్క్వై మార్షల్ అసోసియేషన కార్యదర్శి నూర్‌బాష తెలిపారు.
నంద్యాల హాస్పిటల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : జాతీయస్థాయి స్క్వై మార్షల్ ఆర్ట్స్ చాంపియనషి్‌పలో నంద్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరచినట్లు స్క్వై మార్షల్ అసోసియేషన కార్యదర్శి నూర్‌బాష తెలిపారు. ఈ నెల 5నుంచి 8వరకు స్క్వై ఫెడరేషన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 26వ జాతీయ స్క్వై మార్షల్ చాంపియనషి్‌ప పోటీలు జరిగాయన్నారు. పోటీల్లో నంద్యాల జిల్లాకు చెందిన కెఎస్ అయాజ్ అండర్-11 లోబా వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం, నానివర్ధనరెడ్డి ఖవాంకి విభాగంలో రజిత పతకం, జితేంద్ర రెడ్డి అండర్-14విభాగంలో రజిత పతకం, పావనసాయి, విన్సెంట్‌జాయ్, దినేష్, వీరభద్రలు అండర్-14విభాగంలో కాంస్యపతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు స్క్వై ఫెడరేషన వ్యవస్థాపకులు మీర్ నజీర్ అహమ్మద్, రాష్ట్ర స్క్వై అసోసియేషన చైర్మన ఇస్మాయిల్, సెక్రటరి ఇబ్రహీంలు ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేశారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు.