అంతర్జాతీయ క్రీడా పోటీల్లో ప్రతిభ
ABN , Publish Date - Apr 25 , 2026 | 11:51 PM
థాయిలాండ్‌లో ఈనెల 17నుంచి 20 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన షిప్ 2026 పోటీల్లో ఏఐఎంఎస్ ఫెడరేషన( ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఫెడరేషన) తరపున పాల్గొన్న ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణీలు తమ ప్ర తిభను చాటారు.
ఆదోని టౌన, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : థాయిలాండ్‌లో ఈనెల 17నుంచి 20 వరకు జరిగిన వరల్డ్ మాస్టర్ స్పోర్ట్స్ ఛాంపియన షిప్ 2026 పోటీల్లో ఏఐఎంఎస్ ఫెడరేషన( ఆల్ ఇండియా మాస్టర్స్ స్పోర్ట్స్ ఫెడరేషన) తరపున పాల్గొన్న ఆదోని పట్టణానికి చెందిన ఇద్దరు క్రీడాకారిణీలు తమ ప్ర తిభను చాటారు. రెండు బంగారు, ఒకటి కాంస్య, మూడు వెండి పతకాల ను స్వాధీనం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా మన దేశ మహిళల ప్రతిభను చాటారు. 40-45 ఏజ్ గ్రూప్ కింద ఆదోని మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషనలో తర్పీదు పొందిన నీలం భండారి, హరిత కుమారి థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొన్నారు. నీలం భండారి 2000 మీటర్ల వాక్ పోటీల్లో కాంస్య పతకాలను, 100 మీటర్ల స్ర్పింట్ వాక్‌తోపాటు షాట్ పుట్‌లో రెండు వెండి పతకాలను కైవసం చేసుకున్నారు. హరిత కుమారి అనే మరో మహిళ క్రీడాకారిణి రెండు కిలోమీటర్ల వాక్ పోటీల్లో వెండి పతకాన్ని, డిస్కస్ త్రో తోపాటు 100 మీటర్ల రన్నింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలను స్వాధీనం చేసుకున్నారు. వరల్డ్ మాస్టర్స్ స్పోర్స్ట్ ప్రెసిడెంట్ రఘుకుమార్, రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ విజేతలను అభినందించారు.