‘టాలెంట్ ఏపీ’ ప్రారంభం
ABN , Publish Date - Apr 26 , 2026 | 05:12 AM
కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతున్నవారికి భరోసా ఇచ్చి, అండగా నిలిచేందుకు ‘టాలెంట్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు...
వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకుంటే ప్రపంచ స్థాయి డిజిటల్ టెక్నాలజీ శిక్షణ
ఏపీడీటీఐ నెట్‌వర్క్ నిర్వాహకులు శ్రీధర్
విశాఖపట్నం, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతున్నవారికి భరోసా ఇచ్చి, అండగా నిలిచేందుకు ‘టాలెంట్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు డీప్‌టెక్ నైపుణ్య ఫౌండేషన్, ఏపీడీటీఐ నెట్‌వర్క్ నిర్వాహకులు శ్రీధర్ కొసరాజు శనివారం తెలిపారు. దీనిలో భాగంగా టాలెంట్ ఏపీ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని, అందులో పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రపంచ స్థాయి డిజిటల్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏపీ కోసమే కాకుండా జాతీయ స్థాయిలో టాలెంట్ పూల్ సిద్ధం చేస్తామని, దీనికి 2026-27 సంవత్సరానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రతినిధి సురేశ్ నర్రా అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని వివరించారు. ఆ ఫౌండేషన్ కూడా దీనికి సహకరిస్తుందన్నారు. ఇందులో ఇతర ఐటీ కంపెనీలు కూడా భాగస్వాములుగా ఉంటాయని శ్రీధర్ పేర్కొన్నారు.