Share News

‘తాలీం-ఏ-హునర్‌’ హాల్‌టికెట్లు విడుదల

ABN , Publish Date - May 16 , 2026 | 05:53 AM

పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్‌ విద్య అందించేందుకు వక్ఫ్‌ బోర్డు ‘తాలీం-ఏ-హునర్‌’ పేరుతో అమలు చేయనున్న పథకానికి సంబంధించి..

‘తాలీం-ఏ-హునర్‌’ హాల్‌టికెట్లు విడుదల

  • రేపు రాష్ట్రవ్యాప్తంగా 27 కేంద్రాల్లో టాలెంట్‌ టెస్ట్‌: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌

నెల్లూరు(సాంస్కృతికం) మే 15 (ఆంధ్రజ్యోతి): పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా ఇంటర్‌ విద్య అందించేందుకు వక్ఫ్‌ బోర్డు ‘తాలీం-ఏ-హునర్‌’ పేరుతో అమలు చేయనున్న పథకానికి సంబంధించి 17న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ పరీక్ష జరగనుంది. వక్ఫ్‌ ఎడ్యుకేషన్‌ మిషన్‌ ద్వారా నిర్వహించే ఈ టాలెంట్‌ టెస్ట్‌ హాల్‌టికెట్లను రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ శుక్రవారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఇంటర్‌ రెసిడెన్షియల్‌ విద్యను ఉచితంగా అందిస్తామని తెలిపారు. టాలెంట్‌ టెస్ట్‌కు 7392 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Updated Date - May 16 , 2026 | 05:54 AM