గుర్తులు ఖరారు..!
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:35 PM
రాష్ట్రంలో ఇప్పటికే పురపాలక, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీల్లో జరగనున్న పల్లెపోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన తగిన ఏర్పాట్లు చేస్తోంది.
సర్పంచ అభ్యర్థులకు 25, వార్డుల అభ్యర్థులకు 20 చొప్పున ఎంపిక
మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు
ఆత్మకూరు, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటికే పురపాలక, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాయి. ఇక గ్రామ పంచాయతీల్లో జరగనున్న పల్లెపోరుకు రాష్ట్ర ఎన్నికల కమిషన తగిన ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకించి సర్పంచ ఎన్నికల్లో మూడు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబరు 26, 29, డిసెంబరు 3వ తేదిన ఆయా గ్రామాల సర్పంచలతో పాటు వార్డుల ఎన్నికలు జరపాలని షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాజకీయ పార్టీల గుర్తులు లేకపోవడంతో ఎన్నికల కమిషన పలు గుర్తులను ఎంపిక చేసి అభ్యర్థులకు కేటాయించనున్నారు. ఇందులో సర్పంచ ఎన్నికలకు 25, వార్డు ఎన్నికలకు 20 చొప్పున గుర్తులను ఎంపిక చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరిన్ని గుర్తులను కేటాయించనున్నారు. వీటితో పాటు నోటా కూడా బ్యాలెట్ పత్రంలో పొందుపర్చనున్నారు.
గుర్తులు ఇవే...
గ్రామ పంచాయతీల్లో సర్పంచ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు 25 గుర్తులను కేటాయించారు. మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకాయ, కప్పు సాసర్, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపండ్లు, తిరగలి, కుండ, అరటి పండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనసపండు, షటిల్ కాక్, చేతికర్ర, చెంచులను కేటాయించారు. అదేక్రమంలో వార్డు సభ్యుల ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు ప్రెషర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇస్త్రీపెట్టె, పోస్టుబాక్స్, గ్యాస్‌స్టౌ, బీరువా, ఐస్‌క్రీం, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత స్తంభం, గరాటా, డిష్, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన, బెండకాయ, బెల్టు, కోటు గుర్తులను కేటాయించారు.