Share News

1 నుంచి స్వయం ఏపీ బ్రాండ్‌

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:52 AM

రాష్ట్రంలోని మహి ళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసే నాణ్యమై న ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు కల్పించి విస్తృత మార్కెట్‌ను అందించేందుకు..

1 నుంచి స్వయం ఏపీ బ్రాండ్‌

  • 65 ఉత్పత్తులకు సెర్ప్‌ గుర్తింపు : మంత్రి కొండపల్లి

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహి ళా స్వయం సహాయక సంఘాలు తయారుచేసే నాణ్యమై న ఉత్పత్తులకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ ద్వారా రాష్ట్ర స్థాయి గుర్తింపు కల్పించి విస్తృత మార్కెట్‌ను అందించేందుకు కృషి చేస్తున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలనశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం విజయవాడలోని సెర్ప్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి ఆయా ప్రాంతాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా 65 ప్రత్యేక ఉత్పత్తులను సెర్ప్‌ గుర్తించిందని, 587 మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారవుతున్న ఈ ఉత్పత్తులను ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. ఈ ఉత్పత్తుల నిల్వ, ఆర్డర్ల నిర్వహణ, స్పీడ్‌ సరఫరా కోసం రెండు పుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లను కూడా ప్రారంభిస్తామన్నారు. విజయవాడలో బాపూజీ మ్యూజియం దగ్గర, గొల్లపూడిలోని టీటీడీసీ ప్రాంగణంలో రెండు సిగ్నేచర్‌ స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఉత్పత్తులు అన్ని నాణ్యతా ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తున్నామని.. ఈ విషయంలో మహిళా సం ఘాలకు పూర్తి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జీ మహిళలకు వివాహ సంబంధిత అవసరాల కోసం తక్కు వ వడ్డీతో సులభంగా రుణం అందించేందుకు స్త్రీనిధి కల్యాణలక్ష్మి పథకం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వెలుగుమార్ట్‌ల పనితీరు నిరంతర పర్యవేక్షించడంతో పాటు నష్టాలతో మూతబడిన, సరిగా పనిచేయని మార్ట్‌ల విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Jul 08 , 2026 | 04:54 AM