Share News

డ్వాక్రా మహిళల కోసం ‘స్వయం’

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:45 AM

డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు...

డ్వాక్రా మహిళల కోసం ‘స్వయం’

  • వారి ఉత్పత్తులకు బ్రాండింగ్‌, మార్కెట్‌ కల్పిస్తాం: కొండపల్లి

విజయనగరం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్‌ కల్పించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించేందుకు ‘స్వయం’ పేరిట కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడుతూ ‘స్వయం’ పథకం త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్నారు. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్‌, అంతర్జాతీయ స్థాయిలో వాటిని విక్రయించడానికి అనుమతులు, ప్రమాణాల కోసం పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Updated Date - Mar 10 , 2026 | 04:45 AM