‘ప్రశ్న’ రావణ్ క్షమార్హుడు కాదు
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:36 AM
విదేశీయులు సైతం ప్రస్తుతించే శ్రీరామచంద్రుడు, మహాసాధ్వి సీత వంటి పురాణ పురుషులను దూషించిన ‘ప్రశ్న’ రావణ్‌ను క్షమించరాదని, ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని..
ఈ గడ్డ మీద ఇలాంటివాడు ఎలా పుట్టాడో..
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆగ్రహం
విశాఖపట్నం, జూలై 7(ఆంధ్రజ్యోతి): విదేశీయులు సైతం ప్రస్తుతించే శ్రీరామచంద్రుడు, మహాసాధ్వి సీత వంటి పురాణ పురుషులను దూషించిన ‘ప్రశ్న’ రావణ్‌ను క్షమించరాదని, ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు. ఇతడు అసలు ఈ గడ్డకు, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి చెందినవాడేనా... అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి రావణులను సమాజంలో అనుమతించరాదన్నారు. విశాఖపట్నంలో మంగళవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ‘‘రుషికేశ్‌లో తపస్సు పూర్తి చేసుకొని వచ్చిన నేను భక్తులు చెప్పిన ఓ వార్తతో కదిలిపోయాను. హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని దూషించిన నీచాతినీచుడు రావణ్’’ అని స్వరూపానందేంద్ర మండిపడ్డారు. భారతదేశం విదేశీ మతాల ఉచ్చులో పడకుండా ఆర్‌ఎ్‌సఎస్, విశ్వహిందూ పరిషత్, మఠాలు, పీఠాలు అహర్నిశలు శ్రమిస్తుంటే.. అలాంటి సంస్థలను రావణ్ తూలనాడటం నీచాతినీచమన్నారు. సనాతన ధర్మం పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.