స్వర్ణగ్రామ.. వార్డుల బలోపేతానికి చర్యలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:17 AM
గ్రామ, వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల పాలనను గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల జడ్పీ సీఈవోలుగా పదోన్నతి పొందిన పలువురు పంచాయతీరాజ్ అధికారులను స్వర్ణగ్రామ స్వర్ణవార్డు అధికారులుగా డిప్యుటేషన్‌పై నియమిస్తూ స్వర్ణ గ్రామ స్వర్ణవార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు డైరెక్టర్ కార్యాలయంలో జీవీ సూర్యనారాయణను అడిషనల్ కమిషనర్ (హెచ్‌ఆర్, టీ అండ్ సీబీ)గా నియమించారు. జిల్లా స్వర్ణగ్రామ-స్వర్ణ వార్డు అధికారులుగా తూర్పుగోదావరి జిల్లాకు కె.రత్నకుమారి, నంద్యాలకు కె.లలితాబాయి, అనకాపల్లికి బీవీ సత్యనారాయణ, నెల్లూరుకు డి.వసుమతి, పల్నాడుకు ఎ.స్లీవారెడ్డి, పశ్చిమగోదావరికి ఎ.వెంకటలక్ష్మి, విశాఖపట్నంకు ఆర్.పూర్ణిమాదేవి, ఏలూరుకు జి.వెంకటనాయుడు, అన్నమయ్య జిల్లాకు బి.అమర్నాధ్‌రెడ్డి, అంబేడ్కర్ కోనసీమకు వి.విజయలక్ష్మిని, కాకినాడకు ఎం.రాజును, శ్రీకాకుళంకు కె.కిశోర్‌కుమార్ కుమార్‌ను, విజయనగరానికి ఇ.నాగలక్ష్మిని, అనంతపురం జిల్లాకు జి.నాసర్‌రెడ్డిని, ఎన్టీఆర్ జిల్లాకు కేవీఎస్ రవికుమార్‌ను, కర్నూలు జిల్లాకు టీవీ భాస్కర్ నాయుడును, సత్యసాయి జిల్లాకు కె.శ్రీలక్ష్మిని, కృష్ణా జిల్లాకు జి.పద్మను నియమించారు.