Share News

టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై పీడీ చట్టం అమలు చేయాలి

ABN , Publish Date - Jan 30 , 2026 | 04:38 AM

తిరుమలపై, టీటీడీపై కావాలనే దుష్ప్రచారాలు, అపోహలు సృష్టించే వారిపై తక్షణమే పీడీ యాక్ట్‌ అమలు చేయాలని పలువురు స్వామీజీలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

టీటీడీపై దుష్ప్రచారం చేసిన వారిపై పీడీ చట్టం అమలు చేయాలి

  • జాతీయ హిందూ ధార్మిక సదస్సులో స్వామీజీల డిమాండ్‌

తిరుపతి (కల్చరల్‌), జనవరి 29(ఆంధ్రజ్యోతి): తిరుమలపై, టీటీడీపై కావాలనే దుష్ప్రచారాలు, అపోహలు సృష్టించే వారిపై తక్షణమే పీడీ యాక్ట్‌ అమలు చేయాలని పలువురు స్వామీజీలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీటీడీపై జరుగుతున్న దుష్ప్రచారాలను, అపోహలను నమ్మవద్దని కోరుతూ పలువురు స్వామీజీలు, భక్తులు తిరుపతిలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలపై తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ హిందూ ధార్మిక సదస్సులో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ... ఇటీవల కొందరు కావాలనే టీటీడీపై సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ అపోహలు సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

Updated Date - Jan 30 , 2026 | 04:38 AM