బాధ్యులను కఠినంగా శిక్షించండి: స్వామీజీలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 05:14 AM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలవడంపై పలువురు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తులు కొలిచే దేవదేవుడి ప్రసాదంలో కల్తీ జరగడం భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని స్వామీజీలు పేర్కొన్నారు. లడ్డూ కల్తీకి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతూ వారిద్దరికీ కర్ణాటకకు చెందిన శ్రీశ్రీ వ్యాసరాజ మఠం స్వామీజీ శ్రీవిద్యాశ్రీషతీర్థ, తమిళనాడులోని మన్నార్‌గుడి మఠం స్వామి చెందలంకర సంపత్ కుమార రామానుజ జీయర్, శ్రీ పెరంబదూర్ జీయర్ స్వామి లేఖలు రాశారు.