Share News

జగన్‌ కనుసన్నల్లోనే లడ్డూ కల్తీ : శ్రీనివాసానంద

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:14 AM

వైసీపీ అధినేత జగన్‌ కనుసన్నల్లోనే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగిందని పలువురు వక్తలు మండిపడ్డారు.

జగన్‌ కనుసన్నల్లోనే లడ్డూ కల్తీ : శ్రీనివాసానంద

విజయవాడ(గవర్నర్‌పేట), ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ కనుసన్నల్లోనే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగిందని పలువురు వక్తలు మండిపడ్డారు. శుక్రవారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి మాట్లాడారు. లడ్డూ ప్రసాదాన్ని కల్తీచేసి మహాపచారానికి పాల్పడ్డారని, దీనికి బాధ్యులను దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తారనే నమ్మకం ఉందన్నారు. అమరావతి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి, మాచర్ల శివరామ దీక్షితుల వారి పీఠం మాతాజీ తదితరులు ప్రసంగించారు. సమావేశంలో సాధు పరిషత్‌ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ పలు తీర్మానాలు ఆమోదించారు.

Updated Date - Feb 28 , 2026 | 05:14 AM