Share News

ఐపీఎస్‌ విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ పొడిగింపు

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:54 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఐపీఎస్‌ విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ పొడిగింపు

అమరావతి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి విశాల్‌ గున్ని సస్పెన్షన్‌ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌ను ప్రభుత్వం మూడు సార్లు పొడిగించింది. ముంబయి నటి జెత్వానీ కేసులో 2024 ఆగస్టులో ప్రభుత్వం ఆయన్ని సస్పెండ్‌ చేసింది. అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు సస్పెన్షన్‌ను పొడిగించుకుంటూ వస్తోంది. తాజాగా సమావేశమైన రివ్యూ కమిటీ ఆయన సస్పెన్షన్‌ గడువును 2026 సెప్టెంబరు 4 వరకూ పొడిగించింది. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Jun 20 , 2026 | 05:55 AM