Share News

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Mar 12 , 2026 | 04:15 AM

రాజధాని అమరావతిలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, ఎన్‌ 9 రోడ్డు జంక్షన్‌కు సమీపంలో ఉద్దండరాయునిపాలెం గ్రామం పరిధిలో ఉన్న....

అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం

  • పైపులు దగ్ధం... కోటి నష్టం ప్రమాదంపై స్థానికుల అనుమానం..!

తుళ్లూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు, ఎన్‌ 9 రోడ్డు జంక్షన్‌కు సమీపంలో ఉద్దండరాయునిపాలెం గ్రామం పరిధిలో ఉన్న పైపులు దగ్ధమైపోయాయి. దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకూ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, నిర్మాణ సంస్థ తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపుచేయగలిగాయి. దాదాపు రూ.కోటి వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి పరిశీలించారు. స్టాక్‌ పాయింట్‌లో ఎండు గడ్డి ఎక్కువగా ఉండటంతో ఎండ వేడికి అగ్గి రాజుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అమరావతిలోని కాంట్రాక్టు సంస్థల స్టాక్‌ పాయింట్ల లో ఎండు గడ్డిని వెంటనే తొల గించాలని లక్ష్మీ పార్థసారథి ఆదే శించారు. కాగా, పనిగట్టుకొని తగలబెడితే తప్ప పైపులు దగ్ధమయ్యే పరిస్థితి ఉండదని, కావాలనే ఎవ రో చేస్తున్నారని స్థానిక రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

5.jpg

Updated Date - Mar 12 , 2026 | 04:15 AM