చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్ కేసులో..పూడి శ్రీహరికి చుక్కెదురు
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:03 AM
సీఎం చంద్రబాబు ఫొటోల మా ర్ఫింగ్ కేసులో మాజీ సీఎం జగన్‌కు సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు కు నిరాకరించింది.
ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
మధ్యంతర ఉపశమనానికీ నో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఫొటోల మా ర్ఫింగ్ కేసులో మాజీ సీఎం జగన్‌కు సీపీఆర్వోగా పనిచేసిన పూడి శ్రీహరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ మంజూరు కు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం సైతం కల్పించలేమని చెప్పింది. చంద్రబాబుపై సోషల్ మీడియాల్లో అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర చిత్రాలను పోస్టు చేశారని.. ఆయన చేతిలో కత్తిపెట్టి చిత్రాలను సృష్టించి, వాటిని వైరల్ చేశారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి(మీడియా విభాగం) పూడి శ్రీహరి, గుంటూరు గిరీశ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 15న తాడేపల్లిలో శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. గిరీశ్‌కుమార్‌రెడ్డిని అనంతపురంలో అరెస్టు చేశారు. అయితే నిందితులకు రిమాండ్ విధించేందుకు కుప్పం మేజిస్ట్రేట్ నిరాకరించారు. కుప్పం పోలీసులు ఆ ఉత్తర్వులను హైకోర్టు లో సవాల్ చేశారు. హైకోర్టు కుప్పం మేజిస్ట్రేట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీనిపై శ్రీహరి, గిరీశ్ ఈ నెల 24న వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. వాటిపై మంగళవారం జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మి శ్రా, జస్టిస్ ఎన్‌వీ అంజరియాల ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు నిరంజన్‌రెడ్డి, అల్లంకి రమేశ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్థార్థ్ లూథ్రా హాజరయ్యారు. నిందితులను అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు. నోటీసుల జారీ నెపంతో పోలీసులు నిబంధన లు పక్కన పెట్టారన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రధాన వ్యాజ్యం బుధవారం ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో.. తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులూ జారీ చేయలేమని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకేౖనా మధ్యంతర రక్షణ కల్పించాలని నిరంజన్‌రెడ్డి కోరగా.. రోహత్గీ, లూథ్రా అభ్యంతరం తెలిపారు. హైకోర్టులో ఇరుపక్షాలూ వాదనలు వినిపించుకోవచ్చని చెబుతూ తదుపరి విచారణను మే 13వ తేదీకి వాయిదా వేసింది.