Share News

విద్యుత్‌ ఉద్యోగుల వివాదం పాత బెంచ్‌కే: సుప్రీం

ABN , Publish Date - May 05 , 2026 | 04:56 AM

తెలుగు రాష్ర్టాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన(కేటాయింపు) వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.‘ స్టేట్ క్యాడర్‌’ విభజన కోసం నిర్దేశించిన నిబంధనలు...

విద్యుత్‌ ఉద్యోగుల వివాదం పాత బెంచ్‌కే: సుప్రీం

న్యూఢిల్లీ, మే 4(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజన(కేటాయింపు) వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది.‘ స్టేట్ క్యాడర్‌’ విభజన కోసం నిర్దేశించిన నిబంధనలు, తీర్పులు ‘జోనల్‌ క్యాడర్‌’ ఉద్యోగులకు వర్తించవన్న పిటిషనర్‌ వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీనికి సంబంధించిన పిటిషన్లను గతంలో ఉద్యోగుల కేటాయింపు అంశాలను విచారించిన బెంచ్‌కే బదిలీ చేయాలని రిజిస్ర్టీని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎం.హసన్‌ నజ్కీ వాదనలు వినిపించారు.

Updated Date - May 05 , 2026 | 04:57 AM