అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Feb 16 , 2026 | 03:15 AM
సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న న్యాయమూర్తికి...
సింహాచలం/పెందుర్తి (విశాఖపట్నం), ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): సింహాచలంలోని వరాహలక్ష్మీనృసింహస్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం దర్శించుకున్నారు. సింహగిరికి చేరుకున్న న్యాయమూర్తికి ఈవో జె.వెంకటరావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని, బేడామండప ప్రదక్షిణ పూర్తిచేసిన న్యాయమూర్తికి గోత్రనామాలతో అంతరాలయంలో పూజలు చేసి, శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి అమ్మవారి దర్శనం తరువాత పండితులు ఆశీర్వచనాలిచ్చారు. ఈఓ శాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను, ఆలయ శిల్పసంపదతో రూపొందించిన పుస్తకాన్ని అందజేశారు. అప్పన్న దర్శనానంతరం జస్టిస్ సంజయ్ కరోల్ చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠం అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు చేశారు.