నృసింహుని దర్శించుకున్న జస్టిస్ మహేశ్వరి
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:08 AM
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి దంపతులు సోమవారం మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించా రు.
మంగళగిరి సిటీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి దంపతులు సోమవారం మంగళాద్రి క్షేత్రాన్ని దర్శించా రు. దిగువ సన్నిధిలోని తూర్పు రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. జస్టిస్ మహేశ్వరి దంపతులు శ్రీ లక్ష్మీనృసింహస్వామి, శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి కె.సునీల్‌కుమార్ జస్టిస్ మహేశ్వరి దంపతులకు జ్ఞాపికను అందజేశారు.